victory | దర్గా తండలో శివ నాయక్ విజయం

victory | దర్గా తండలో శివ నాయక్ విజయం

victory | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట మండల పరిధిలోని దర్గా తండ గ్రామ పంచాయతీ మూడవ విడతలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన శివ నాయక్ 63 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బుధవారం నిర్వహించిన పోలింగ్‌లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 63 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. 8 వార్డులకు గాను ఐదు కాంగ్రెస్, మూడు బీఆర్ ఎస్ వార్డులను కైవసం చేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగగా, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు.

ఓట్ల లెక్కింపు అనంతరం శివ నాయక్ విజయం ఖరారు కాగానే గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు భారీగా పాల్గొని మిఠాయిలు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివ నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. దర్గా తండ గ్రామాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజల సహకారంతో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply