గిరిజనులకు ఏం చేశారని బస్సు యాత్ర..
- లంబాడ జేఏసీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ ధారావత్ జై సింగ్ నాయక్
తొర్రూరు, ఆంధ్రప్రభ : గిరిజనులకు ఏం చేశారని బస్సు యాత్ర చేస్తున్నారని లంబాడ జేఏసీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ ధారావత్ జై సింగ్ నాయక్ విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. 50 సంవత్సరాల సర్వోత్సవాలు అంటూనే కేవలం 50 మందితో సభలు నిర్వహించడం గిరిజన సమాజాన్ని అవమానించడమే అని,బంజారా ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా సిగ్గు పడాలని,యావత్ బంజారా సమాజం మీ వైఖరి చూసి తలదించుకుంటుందని, గిరిజనులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. బంజారాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం లేదని వాపోయారు. గిరిజనులకు ఏం చేశారని యాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.
