2026 Season 2 Cricket | క్రీడలతో మానసిక ఉల్లాసం…

2026 Season 2 Cricket | క్రీడలతో మానసిక ఉల్లాసం…

  • ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషణ్

2026 Season 2 Cricket | కడం ( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన కడంలో కడం ప్రీమియర్ లీగ్. 2026 సీజన్ 2 క్రికెట్ ఈ రోజు ఖానాపూర్ ఏఎంసి చైర్మన్ పి భూషణ్ కడం పీఎస్ ఎస్ ఐపీ సాయికిరణ్, పెద్దూరు కడం సర్పంచ్ దీకొండ విజయ్ కుమార్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాని ఉత్సవాన్ని కలిగిస్తాయని, ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని వారన్నారు. క్రీడలు క్రీడాకారుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని అందుకే ప్రతి ఒక్కరు క్రీడల్లో పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పి సతీష్ రెడ్డి, కడెం మాజీ వైస్ ఎంపీపీ కట్ట శ్యాంసుందర్, కడం పెద్దూర్ కొండకూరు గ్రామాల ఉప సర్పంచులు పిట్టల రాజన్న, పి సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఎండి వాజిద్ ఖాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఎం మల్లేష్ యాదవ్, కె బ్రహ్మచారి, బీజేపీ నాయకులు గడప దేవరాజ్, ముక్కెర గంగాధర్, పూస శ్రీరామ్, ఎం కృష్ణ, టిఆర్ఎస్ నాయకులు ముబారక్ ఇస్లావత్ గంగన్న, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పి సంపత్ రెడ్డి, క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.