voters | పోలింగ్ కేంద్రాల‌ సందర్శ‌న..

voters | పోలింగ్ కేంద్రాల‌ సందర్శ‌న..

  • 12:4 నిమిషాల వరకు 73 శాతం పోలింగ్ న‌మోదు

voters | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రం పరిధిలోని ఆళ్లపల్లి మర్కోడు పలు పంచాయ‌తీల పోలింగ్ కేంద్రాల(Polling centers)ను బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిష‌న‌ల్ కలెక్టర్ వేణుగోపాల్ సందర్శించారు. మండలంలో మూడో విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శాంతియుత, రాజ్యాంగబద్ధంగా నిర్వహించే స్థానిక సంస్థల ఎన్నికల కేంద్రాలను పరిశీలించారు.

ఎంపీడీవో ధీరావత్ శ్రీను, స్థానిక ఎన్నికల అధికారులు వివిధ బూత్ సెంటర్(booth centers) లోని పోలింగ్ శాతాలను వివరించారు. ఆళ్లపల్లి ఎంపీడీవో ధీరావత్ శ్రీను, స్థానిక ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి మండలాల్లో మూడో విడత సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నిక పోలింగ్ బుధవారం ఉదయం 07 గంటలకు ప్రారంభమై పంచాయతీలలో ఓటర్లు(voters) బారులుతీరి నిలబడి ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారు.

12:4 నిమిషాల వరకు 73 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల స్పెషల్ ఆఫీసర్(special officer) ఎంపీడీవో శ్రీను తెలిపారు. నూతనంగా 2025న వచ్చిన వారు మొదటిసారి పల్లెల్లోని యువత, యువకులు తమ ఓటుహక్కును సంతోషంగా వినియోగించుకున్నారు.

మూడో విడత ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు, ప్రజల పరిరక్షణ కోసం మండల వ్యాప్తంగా పోలీస్ సిబ్బంది(police personnel) టేకులపల్లి సిఐ బత్తుల సత్యనారాయణ, స్థానిక ఎస్ఐ ముత్తినేని సోమేశ్వర్, తహసీల్దార్ జగదీష్ ఎన్నికల బూత్ లకు వేర్వేరుగా గట్టి బందోబస్తు నిర్వహించి పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది.

Leave a Reply