19yrs | అత్తిలిలో విషాద ఘటన

19yrs | అత్తిలిలో విషాద ఘటన

19yrs |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న తండ్రి గణేశ్‌, తన కుమారుడు శామ్యూల్ రాజు(19)ను కత్తెరతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

స్థానికుల సమాచారం ప్రకారం.. గణేశ్ తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవలు సృష్టించేవాడు. ఈ క్రమంలో అతిగా మద్యం సేవించిన అతడు తన కుమారుడిపై దాడి చేసి కత్తెరతో తీవ్రంగా గాయపరిచాడు.

తీవ్ర రక్తస్రావంతో ఉన్న శామ్యూల్ రాజును కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గణేశ్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply