15May market | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం

15May market | బంగారం, వెండి ధరల్లో భారీ పతనం

15May market | బంగారం ధరలకు భారీ బ్రేక్
హైదరాబాద్‌లో తాజా బంగారం ధరలు
వెండి ధరల్లో షాకింగ్ తగ్గుదల
ప్రధాన నగరాల్లో పసిడి ధరల పరిస్థితి
కొనుగోలుదారులకు భారీ ఉపశమనం

15May market | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్‌ : ఇటీవలి కాలంలో వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరల జోరుకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అలాగే కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను పెంచడం వంటి కారణాలతో శుక్రవారం దేశీయ బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ హైదరాబాద్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మే 15 ఉదయం మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా రూ.2,240 తగ్గి రూ.1,60,090కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర కూడా రూ.2,050 తగ్గి రూ.1,46,750 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1680 తగ్గి రూ.1,21,750 నుంచి రూ.1,20,070కి చేరుకుంది.

వెండి ధరల్లో కూడా అదే తరహా పతనం కనిపించింది. కిలో వెండి ధరపై ఏకంగా రూ.10,000 తగ్గుదల నమోదవడంతో ప్రస్తుతం ధర రూ.3.05 లక్షల వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,090గా ఉండగా, ఢిల్లీలో రూ.1,60,240గా నమోదైంది. చెన్నైలో మాత్రం కొద్దిగా ఎక్కువగా రూ.1,63,390 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.3.05 లక్షల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. మొత్తంగా, నిన్నటితో పోలిస్తే దేశవ్యాప్తంగా పసిడి, వెండి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదవడంతో కొనుగోలుదారులకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది.

CLICK HERE TO READ gold rate| వ‌రుస‌గా నాలుగో రోజు ధ‌ర‌లు పైపైకి..

CLICK HERE TO READ MORE