10matches | శ్రేయస్ అయ్యర్‌కు చాన్స్
10matches | శ్రేయస్ అయ్యర్‌కు చాన్స్
సూర్యకుమార్ యాదవ్‌కు చెక్!
ఐర్లాండ్ టూర్ నుంచే ప్రకటించే అవకాశం
టీ20 వరల్డ్‌కప్ 2028, ఒలింపిక్సే లక్ష్యంగా బీసీసీఐ
పూర్ ఫామ్‌లో సూర్యకుమార్ యాదవ్
ఐపీఎల్‌లోనూ ఫెయిల్
అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్
10matches | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీమిండియా టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. ఫామ్‌లో లేని ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను పక్కనబెట్టి శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు అప్పచెప్పడానికి రెడీ అవుతోంది. భారత్‌ను వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ఛాంపియన్‌గా నిలిపి . కెప్టెన్‌గా సూర్య సూపర్ సక్సెస్ అయ్యాడు. కానీ బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా సూపర్‌గా రాణిస్తున్న శ్రేయాస్ అయ్యర్‌కు పగ్గాలు ఇవ్వాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది.
కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత సూర్యకుమార్ యాదవ్ పెద్దగా రాణించలేకపోయాడు. అంతకుముందు వరుస సెంచరీలతో పాటు టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌లో కొనసాగిన సూర్య.. కెప్టెన్సీ తర్వాత విఫలమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్‌లో కూడా యూఎస్ఏ మీదే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో సూర్యకుమార్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడి 195 పరుగులే చేశాడు. మరోవైపు, పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్.. 9 ఇన్నింగ్స్‌ల్లో 333 పరుగులు చేశాడు. ఈ కారణాలు అన్నింటితో 35 సంవత్సరాల సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉంది. అయితే ప్లేయర్‌గా సూర్య కొనసాగుతాడా లేదా అనేది తెలాల్సి ఉంది.
