డ్రిప్ సేద్య పరికరాలపై 100శాతం ఉచితం..

డ్రిప్ సేద్య పరికరాలపై 100శాతం ఉచితం..
- రైతులకు లాభదాయకం ఆయిల్ ఫామింగ్
- ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సమావేశం
నారాయణపేట, ప్రతినిధి : రైతులు ఆయిల్ పామ్ సాగు(Oil palm cultivation) ద్వారా అధిక లాభాలు పొందగలరని జిల్లా సహకార అధికారి ప్రసాద్‌రావు తెలిపారు. నారాయణపేట పీఏసీఎస్ కార్యాలయ(PACS Office) ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలను ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి పామ్ ఆయిల్ మొక్కను ఎకరానికి 57 శాతం సబ్సిడీతో కేవలం రూ.20కే రైతులు పొందవచ్చు. డ్రిప్ సేద్య పరికరాలపై ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం ఉచితం (కేవలం 12% జీఎస్టీ మాత్రమే చెల్లించాలి), బీసీ రైతులకు 90 శాతం సబ్సిడీ, 10 శాతం రైతు భారం, అలాగే ఓసీ రైతులకు ఐదు ఎకరాల పైబడిన భూస్వామ్యంపై 80 శాతం సబ్సిడీ లభిస్తుంది” అని తెలిపారు.
అలాగే పంట సాగు ప్రారంభమయ్యే వరకు నాలుగేళ్లపాటు ఎకరానికి రూ.4,200(Rs.4,200 per acre) చొప్పున ప్రభుత్వం సహాయం అందజేస్తుందని చెప్పారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత 50 సంవత్సరాల పాటు నెలకు రెండు సార్లు క్రాప్ కటింగ్ చేసుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం ఒక్క టన్ను పామ్ ఆయిల్ ధర రూ.19,682గా(palm oil price Rs 19,682) ఉందని వివరించారు.
రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక ఆదాయం పొందాలని ఆయన సూచించారు. మరిన్ని వివరాలకు నారాయణపేట పిఏసిఎస్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహకార కార్యాలయం నుండి అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆంజనేయులు(Anjaneyu), లావణ్య, సంఘ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
