West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి

West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి
West Asia | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రతీకార దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్‌లోని కీలక ప్రాంతాలతో పాటు, పశ్చిమాసియాలోని పలు అమెరికా సైనిక స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది.
పశ్చిమ ఇరాక్‌లో ఇరాన్ మద్దతు గల గ్రూపులు దాడులు నిర్వహించాయి. ఈ దాడులకు ప్రతిగా అమెరికా కూడా ప్రత్యుత్తర దాడులు చేపట్టింది. ఈ ఘటనలో ఇరాన్ అనుకూల గ్రూప్‌కు చెందిన సుమారు 15 మంది మృతి చెందినట్లు సమాచారం.
ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడులు, ప్రతిదాడులు కొనసాగుతుండటంతో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శాంతి చర్చల కోసం పిలుపునిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్రిక్తతలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.
