వైఎస్సార్ ఆశయాలే కాంగ్రెస్‌కు మార్గదర్శకం: బొడ్డు గంగన్న
కడెం, ఆంధ్రప్రభ: దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఆశయాలు కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకంగా నిలుస్తాయని కడెం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు గంగన్న అన్నారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాల మేరకు బుధవారం కడెం మండలం లింగాపూర్ గ్రామంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బొడ్డు గంగన్న మాట్లాడుతూ, రైతు సంక్షేమం, పేద ప్రజల అభ్యున్నతికి వైఎస్సార్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన సిద్ధాంతమని, వైఎస్సార్ చూపిన అభివృద్ధి, సంక్షేమ మార్గంలోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రాజా నర్సయ్య, ప్రధాన కార్యదర్శులు ముడికె మల్లేశ్ యాదవ్, ముస్కు రాజేందర్, మైనారిటీ సెల్ అధ్యక్షుడు సలీం, బీసీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాధాసు రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
