అంగరంగ వైభవంగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం

అంగరంగ వైభవంగా విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం

నేరేడుచర్ల, ఆంధ్రప్రభ: మండలంలోని బక్కయ్య గూడెంలో నూతనంగా నిర్మించిన రామాలయం, కనకదుర్గా ఆలయంలో బుధవారం విగ్రహా ప్రతిష్టాపనమహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతరామాంజనేయ, లక్ష్మణ, కనకదుర్గ, ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలతో పాటు కీర్తి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేద పండితులు ఇరువంటి వెంకటరమణ, ఇరువంటి సత్యనారాయణ శర్మ, బొన్న భట్ల కిషోర్ శర్మ, దివేదుల వరి శర్మ, బొన్నభట్ల వెంకటేష్ శర్మ, బాచి మంచి షణ్ముఖ శర్మల ఆధ్వర్యంలో విగ్నేశ్వర పూజ, పూణ్యహావాచనం, పంచగవ్వ ప్రాసన, యాగశాల పూజలు, హోమాలు, మంత్ర పుష్పలు, శ్రీరామ తారక సుదర్శన హోమంతో పాటు అనేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమాన్ని పురష్కరించుకోని భక్తులు కిటకిటలాడారు. కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకుడు పిల్లుట్ల రఘు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Leave a Reply