Young Heroes Turned Directors | మెగాఫోన్ ప‌డుతున్న కుర్ర హీరోలు

Young Heroes Turned Directors | మెగాఫోన్ ప‌డుతున్న కుర్ర హీరోలు

Young Heroes Turned Directors | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమా ఇండస్ట్రీలో కొందరు సినిమాను ముందుండి నడిపిస్తే.. మరికొందరు సినిమా వెనుక నిలబడి కథను నడిపిస్తారు. కానీ ఈ రెండూ చేసినవాళ్లు మాత్రం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంటారు. ప్రస్తుతం ఉన్న యువ హీరోలు నటులుగా పేరు తెచ్చుకున్న తర్వాత మెగాఫోన్ పట్టి దర్శకులుగా మారుతున్నారు. తమలో నటనతో పాటు దర్శకత్వ ప్రతిభ కూడా ఉందని నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవాలోకి మన పక్కింటి కుర్రాడు కిరణ్ అబ్బవరం కూడా చేరిపోయారు. తనే హీరోగా నటిస్తూ ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యువ నటులు దర్శకులుగా మారడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే పలువురు హీరోలు తమ సినిమాలకు తామే దర్శకత్వం వహించారు. ఇంతకీ ఆ నటులు ఎవరో ఓ లుక్కేద్దామా…

Young Directors

Young Heroes Turned Directors | అడవి శేష్..

ఈ జాబితాలో ముందు వరుసలో ఉండే నటుడు అడవి శేష్. 2002లో విడుదలైన ‘సొంతం’ సినిమాలో చిన్న పాత్ర ద్వారా తెరపై కనిపించిన శేష్, 2010లో విడుదలైన ‘కర్మ’ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఈ సినిమా ద్వారా తనలోని నటుడినే కాదు, దర్శకుడిని కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

Young Directors

Young Heroes Turned Directors | విశ్వక్ సేన్..

విశ్వక్ సేన్ హీరోగా నటించిన తొలి చిత్రం 2017లో విడుదలైన ‘వెళ్లిపోమాకే’. అనంతరం ‘ఈ నగరానికి ఏమైంది’, ‘ఫలక్‌నుమా దాస్’, ‘హిట్: ది ఫస్ట్ కేస్’ వంటి చిత్రాలతో యువ కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఫలక్‌నుమా దాస్’. అనంతరం ‘దాస్ కా ధమ్కీ’ చిత్రానికీ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. ఈ రెండు చిత్రాలు ఆయనకు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

Young Directors

Young Heroes Turned Directors | అవసరాల శ్రీనివాస్..

అవసరాల శ్రీనివాస్ నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ మంచి గుర్తింపు పొందారు. 2008లో విడుదలైన ‘అష్టా చెమ్మా’ చిత్రంతో నటుడిగా పరిచయమైన ఆయన, 2011లో ‘ఓ మై ఫ్రెండ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడిగా 2014లో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నారు. అనంతరం ‘జ్యో అచ్యుతానంద’, ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Young Directors

Young Heroes Turned Directors | రాహుల్ రవీంద్రన్..

రాహుల్ రవీంద్రన్ నటుడిగా, దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు ‘అందాల రాక్షసి’ చిత్రంతో పరిచయమయ్యారు. అనంతరం పలు చిత్రాల్లో హీరోగా, కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడిగా 2018లో విడుదలైన ‘చి లా సౌ’ సినిమాతో మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంలోనే ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ‘మన్మథుడు 2’, ప్రస్తుతం తెరకెక్కుతున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Young Directors

Young Heroes Turned Directors | వశిష్ఠ..

వశిష్ఠ దర్శకుడిగా 2022లో విడుదలైన ‘బింబిసార’ సినిమాతో పరిచయమయ్యారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో వశిష్ఠకు దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే ఫాంటసీ, టైమ్ ట్రావెల్ అంశాలను ఆకట్టుకునే విధంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు.

దర్శకుడిగా గుర్తింపు పొందకముందు వశిష్ఠ హీరోగానూ నటించారు. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘ప్రేమలేఖ రాశా’. ఈ చిత్రంలో అంజలి కథానాయికగా నటించగా, వశిష్ఠను వెంకట్ మల్లిడి పేరుతో పరిచయం చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకపోయినా, తర్వాత టెలివిజన్‌లో ప్రసారమైంది.

Young Directors

Young Heroes Turned Directors | వెంకీ అట్లూరి..

వెంకీ అట్లూరి నటుడిగా ‘జ్ఞాపకం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అనంతరం కొన్ని చిత్రాల్లో నటించి, రచయితగా కూడా పనిచేశారు. దర్శకుడిగా 2018లో విడుదలైన ‘తొలిప్రేమ’ సినిమాతో మెగాఫోన్ పట్టారు. వరుణ్ తేజ్, రాశి ఖన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో వెంకీ అట్లూరికి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’, ‘రంగ్ దే’, ‘సార్/వాతి’, ‘లక్కీ భాస్కర్’ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

Young Directors

CLICK HERE TO READ GV Prakash Venky Anil 5 | ఫన్ కాన్సెప్ట్‌తో అనిల్ రావిపూడి స్పెషల్ అనౌన్స్‌మెంట్‌

CLICK HERE TO READ MORE