దేశ అభివృద్ధికి మోదీ పాలన నిలువెత్తు నిదర్శనం

దేశ అభివృద్ధికి మోదీ పాలన నిలువెత్తు నిదర్శనం

  • బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివాజీ

గోదావరిఖని, (ఆంధ్రప్రభ) : భారత దేశ చరిత్రలో మునుపెన్నడు కానీ విని ఎరగని రీతిలో ప్రజా సంక్షేమం, దేశ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన దిగ్విజయంగా నడుస్తోందని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసిపేట శివాజీ అన్నారు. మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల పాలన సమయం పూర్తయిన సందర్భంగా…శుక్రవారం గోదావరిఖని ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర నాయకులు కాజీపేట శివాజీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ హాయంలో భారతదేశంలోని దళిత బడుగు బలహీన వర్గాలన్నింటికీ సముచిత న్యాయం జరిగిందని చెప్పారు.

దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ పట్టణ ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక రహదారులను నిర్మాణం చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. పేద వర్గాల అభ్యున్నతి కోసం మోడీ పాలనలో అనేక స్కీములను ఏర్పాటు చేసిన విషయాలను ఈ సందర్భంగా శివాజీ గుర్తు చేశారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ఆలోచన చేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై మోడీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతి ఏట వంద కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న విషయాన్ని శివాజీ స్పష్టం చేశారు.

బిజెపి జిల్లా కార్యదర్శి సోమవరపు లావణ్య మాట్లాడుతూ నిరుపేద మహిళలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నివేళలా అండగా భరోసాగా నిలుస్తోందని చెప్పారు. పేదలకు రేషన్ బియ్యం పంపిణీలో కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద చెయ్యి అన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు లావణ్య పేర్కొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం హాయంలో చేపడుతున్న ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం విడుదల చేస్తున్నా స్కీం ల వివరాలను ప్రతి ఇంటికి వివరించే కార్యక్రమం త్వరలోనే చేపడతామన్నారు. విలేకరుల సమావేశంలో బిజెపి జిల్లా పార్టీ నాయకులు నరహరి, సులువ లక్ష్మీ నరసయ్య, శోభారాణి, కొండపర్తి సంజీవ్, పవన్ సతీష్ ,రవి, మల్లేష్ ,రఘు తో పాటు తదితరులు పాల్గొన్నారు.