GV Prakash Venky Anil 5 | ఫన్ కాన్సెప్ట్‌తో అనిల్ రావిపూడి స్పెషల్ అనౌన్స్‌మెంట్‌

GV Prakash Venky Anil 5 | ఫన్ కాన్సెప్ట్‌తో అనిల్ రావిపూడి స్పెషల్ అనౌన్స్‌మెంట్‌

GV Prakash Venky Anil 5 | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: విక్టరీ వెంకటేశ్‌ , అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్‌ అందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జీవీ ప్రకాశ్‌ కు ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకునేలా సంగీతం అందించడంలో ప్రత్యేక గుర్తింపు ఉందరి చెప్పాలి.

అదే విషయాన్ని చెబుతూ.. ఆయన మ్యూజిక్‌పై తనకెప్పటి నుంచో అభిమానం ఉందని అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. #VenkyAnil5 – #NKRAnil2 ప్రాజెక్ట్‌లో జీవీ ప్రకాశ్ చేరడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

ఈ అనౌన్స్‌మెంట్ కోసం రూపొందించిన ఫన్ కాన్సెప్ట్‌ను చాలా ఎంజాయ్ చేస్తూ పూర్తి చేశామని అనిల్ తెలిపారు. తమ ఆలోచనను నమ్మి, పూర్తిగా సహకరించి, ఆ కాన్సెప్ట్‌ను మరింత సరదాగా మార్చినందుకు జీవీ ప్రకాశ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఈ కాంబినేషన్‌తో మంచి మ్యూజికల్ మెమొరీస్ క్రియేట్ చేయడానికి ఎదురుచూస్తున్నామని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. వెంకటేష్–అనిల్ కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను బాగా అలరించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

CLICK HERE TO READ Sing geetham cinema review | మాటలు లేవు.. అంతా పాటలే! సినిమా ఎలా ఉందంటే?

CLICK HERE TO READ MORE

Leave a Reply