ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు..
ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు..
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్బంగా ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లా,నియోజకవర్గం ఇన్చార్జి రేగు బాలనర్సయ్య ఆధ్వర్యంలో తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సీఎం జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు చేసి సీఎం చంద్రబాబు నాయుడు పేరున అర్చన ఆశీర్వచన చేయించి శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొండక్రింద బస్టాండ్ వద్ద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండా ఆవరణలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రేగు బాలనర్సయ్య ఈ జన్మదిన వేడుకలు సందర్బంగా మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసారని ప్రజల ముందు చూపుతో ఈనాడు ఉమ్మడి రాష్ట్రాలలో ఐటీ రంగంలో దూసుకుపోవడం లో హైదరాబాద్ లో ప్రత్యేక కృషి చొరవతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ఉపాధి కల్పించారని హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అడాప్ట్ కమిటీ సభ్యులు తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షులు గుండా భాస్కర్, మండల పార్టీ అధ్యక్షలు, మచ్చ నరసింహ గౌడ్, కళ్ళెం బాబురావు గౌడ్,పట్టణ శాఖ అధ్యక్షులు చిత్తర్ల శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకురాలు గుజ్జనిర్మల మహేశ్వరి, సత్తమ్మ, బొమ్మలరామారం మండల పార్టీ అధ్యక్షులు చాగంటి బాల నరసింహా, బేతల బాలనరసింహ, కృష్ణ, గుండాల మండల పార్టీ అధ్యక్షుడు పొలాస వెంకన్న, నాయకులు సీసరాజు, ఒదిగల బిక్షపతి, వనమాల సత్యనారాయణ, శేషగిరి రావు, తదితరులు పాల్గొన్నారు.
