4వ వార్డులో బీజేపీ అభ్యర్థి పికె.నర్సింహా గెలుపు

మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 1హ4వ వార్డులో బిఆర్ఎస్ బిజెపి పార్టీల మధ్య హోరావూరిగా పోరు సాగింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన పోరులో చివరకు బిజెపి అభ్యర్థి పికె.నర్సింహా విజయం సాధించారు. ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీచేసిన పికె.నర్సింహా కు 747 ఓట్లు లభించగా బిఆర్ఎస్ అభ్యర్థి అంంబ్రేష్ కు 363 ఓట్లు లభించాయి.కాంగ్రెస్ అభ్యర్థి శివకుమార్ కు 153 ఓట్లు మాత్రమే లబించాయి. దీంతో బిఆర్ఎస్ అభ్యర్థి అంబ్రేష్ పై బిజెపి అభ్యర్థి పికె.నర్సింహా 384 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. దీంతో బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు.
