పారదర్శకంగా వరి ధాన్యం కొనుగోలు చేయాలి…

  • ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోళ్లపై మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో నాగర్ కర్నూల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ధాన్యం తరలింపు, చెల్లింపుల ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.

Leave a Reply