కొత్త బస్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే అంజిబాబు

బస్టాండ్ లోని స్టాల్స్, క్యాంటీన్, బాత్ రూమ్స్ లను పరిశీలిన
ప్రయాణికులతో స్త్రీ శక్తి పథకంపై అరా..

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : భీమవరం కొత్త బస్టాండ్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్ లోని స్టాల్స్, క్యాంటీన్, బాత్ రూమ్స్ లను పరిశీలించారు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకంపై ప్రయాణికులతో మాట్లాడి ఆరా తీశారు. బస్టాండ్ లోని క్యాంటీన్ ను పరిశుభ్రంగా ఉంచాలని, కూరగాయలను ఆహార పదార్థాలను పరిశుభ్రంగా ఉంచుకుని నాణ్యమైన ఆహారాన్ని ప్రయాణికులకు అందించారన్నారు. స్టాల్స్ లో అధిక ధరలు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భీమవరం బస్టాండ్ నుంచి ఎన్ని బస్సులు వెళున్నాయో ప్రతి రోజు సుమారు ప్రయాణికుల సంఖ్య వివరాలను ఆర్టీసీ అధికారులు గిరిధర్ కుమార్ ఎమ్మెల్యే కు వివరించారు.

ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం బస్టాండ్ పరిసరాలను అన్ని పరిశుభ్రంగా ఉన్నాయని, ఎప్పుడూ ఎక్కడ తనిఖీ చేస్తానో చెప్పకుండానే ప్రతి చోట విస్తృత తనిఖీలు చేస్తానన్నారు. స్త్రీ శక్తి పథకంతో మహిళలు బస్సు సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారని, త్వరలోనే సామాన్యులకు అందుబాటులో ఉండే విధానంగా భీమవరం నుంచి కొత్త ఏసీ బస్సులు రానున్నాయని అన్నారు. అన్ని పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కార్యక్రమంలో వబిలిశెట్టి రామకృష్ణ, సతివాడ నవీన్, లంకి చిన్ని, మాగపు ప్రసాద్, పాలకోడేటి కార్తీక్, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply