హర్మూజ్ తెరుస్తారా? నరకానికి పంపించమంటారా…?

హర్మూజ్ తెరుస్తారా? నరకానికి పంపించమంటారా…?

Donald Tramp | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. ఇరాన్ హర్మూజ్ మార్గాన్ని తెరవకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. హర్మూజ్‌ తెరుస్తారా?.. నరకానికి పంపించమంటారా? అన్నారు. అంతే కాకుండా సహనం కోల్పోయి ఇరాన్‌ పై బూతులతో విరుచుకుపడ్డారు ట్రంప్. మంగళవారం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సూచిస్తూ పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిల పై దాడుల గురించి హెచ్చరికలు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికా దాడులకు సిద్ధంగా ఉందని కూడా పేర్కొన్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి.

హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. గల్ఫ్ దేశాల నుంచి ప్రపంచ మార్కెట్లకు వెళ్లే చమురులో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. ఈ మార్గం మూసివేస్తే చమురు ధరలు పెరగడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సహా పలు దేశాలు శాంతియుత పరిష్కారానికి పిలుపునిస్తున్నాయి.

ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించకపోయినా, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని గతంలో స్పష్టం చేసింది. అమెరికా చర్యలకు తగిన విధంగా స్పందిస్తామని కూడా ఇరాన్ నాయకత్వం పలు సందర్భాల్లో ప్రకటించింది. హర్మూజ్ జలసంధి పరిస్థితిపై ఇప్పుడు ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. పరిస్థితి మరింత విషమిస్తే.. చమురు సరఫరా, భద్రత, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply