‘చంద్రమా మనసో జాత:’ అనునది పురుష సూక్త వాక్యం. పరమాత్మ మనసు నుండి చంద్రుడు పుట్టానని భావం. చంద్రుడు సముద్రుని వలన క్షీరసాగర మదనంలో పుట్టాడని, అత్రి మహర్షి వలన పుట్టాడని పురాణగాథలు కలవు. దేవతలు అనేక సార్లు అనేక కారణాల వలన జన్మిస్తూ ఉంటారు. అసలు పుట్టుక మనసు నుండి కావున చంద్రుడు మనసులోని వికారాలకు కారణమని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తోంది. అందుకే చంద్రుని గ్రహచారంలో, జాతకంలో దోషం లేని వ్యక్తులు కూడా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. నారాయణుడి నామ స్మరణతో చంద్రుడు అనుకూలించి మనసును నిర్మలంగా ఉంచుతాడు.
చంద్రుడికి మనసుకి ఉన్న సంబంధం ఏమిటి?
