వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి…
జిల్లా కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు, ఆంధ్రప్రభ : ఈ ఏడాది వేసవి కాలంలో వడగాల్పులు అధికంగా నమోదైయ్యే అవకాశం ఉండడంతో, ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పేర్కొన్నారు. సోమవారం ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటుచేసిన చలివేంద్రంను జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ఏడాది వేసవి కాలంలో వడగాల్పులు అధికంగా నమోదైయ్యే అవకాశం ఉండడంతో, ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
వేసవిలో మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయట తిరగరాదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. జిల్లా యంత్రాంగం తరపున సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను కూడా రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల కోసం తాగునీటి సదుపాయం కల్పించేందుకు ప్రతి మండల కార్యాలయాల్లో, సచివాలయాల్లో, ముఖ్య కూడళ్ళలో చలివేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్ళలో షెల్టర్స్, చలివేంద్రాల ఏర్పాటు పట్ల దృష్టి సారించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
వడగాల్పులు వలన వచ్చే ఆరోగ్య సమస్యల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన మందులు అన్నీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, సిద్దంగా ఉంచినట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, ఒంగోలు ఆర్డిఓ శ్రీమతి లక్ష్మి ప్రసన్న, ఎస్.డి సి శ్రీధర్ రెడ్డి, మున్సిపల్ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర రావు, స్టెప్ సిఈఓ శ్రీ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
