Warangal | ఆకస్మిక తనిఖీలు..

Warangal | ఆకస్మిక తనిఖీలు..

  • ఓరుగల్లులో అర్ధరాత్రి మేయర్ తనిఖీలు..
  • మొదటిసారి మేయర్ అర్ధరాత్రి తనఖీలు..
  • శానిటేషన్ నిర్వహణ తీరుపై ఫోకస్..
  • పని తీరును మెరుగుపరిచే కసరత్తు..

Warangal, వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో అర్ధరాత్రి వేళ జరిగే శానిటేషన్ పనుల నిర్వహణ తీరుతెన్నులను మేయర్ (Mayor) గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం అర్ధరాత్రి హన్మకొండ చౌరస్తా, పోచమ్మ మైదాన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను పరిశీలించారు. చలిలోను రోడ్లను ఊడ్చుడాన్ని గమనించారు. రాత్రివేళ స్వీపింగ్ సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా తప్పని సరిగా రేడియం జాకెట్స్ వేసుకోవాలని మేయర్ సుధారాణి సూచించారు. మెయిన్ రోడ్ల పై శుభ్రత పనులు నిర్వర్తించే సమయాల్లో జవాన్లు అందుబాటులో ఉండటంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ సూచించారు. నైట్ వర్క్స్ పని తీరును మరింత పకడ్బందీగా నిర్వర్తించాలని మేయర్ సుధారాణి ఆదేశించారు.

Leave a Reply