30th anniversary | ఎన్టీఆర్ కు ఘన నివాళులు

30th anniversary | ఎన్టీఆర్ కు ఘన నివాళులు

  • నివాళుల‌ర్పించిన‌ ఇల్లందు తెలుగు తమ్ముళ్లు
  • ఎన్టీఆర్ కు భారతరత్నఇవ్వాలి
  • నియోజక కన్వీనర్ ముద్రగడ వంశీ

30th anniversary | ఇల్లెందు, ఆంద్రప్రభ : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించి, కొబ్బరికాయలు కొట్టి, పూలదండలు వేసి జోహార్ ఎన్టీఆర్ అని నినాదాలు చేస్తూఎన్టీఆర్ కు నివాళులర్పించారు.

ఈసందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విజయలక్ష్మి నగర్ సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు మాట్లాడుతూ… ఎన్టీఆర్ అనేది ఒక చరిత్ర అని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని, సంక్షేమ పథకాలకు అధ్యుడు ఎన్టీ రామారావు అని, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశం మొత్తం ఆయన మొదలుపెట్టిన పథకాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు.

ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఎన్టీఆర్ చూపించిన మార్గంలోనే ముందుకు నడుస్తామని, రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ బలమైన శక్తిగా ఎదిగి, ఈ రాష్ట్రంలో కీలకంగా మారుతుందని ఈ సందర్భంగా వారు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దేశవత్ శ్రీహరి, బాలాజీ నగర్ వార్డు మెంబర్ మనుబోతుల అఖిల్, సీనియర్ నాయకులు కారు నర్సన్న, మైపా బాలరాజు, వేమూరి సల్మాన్ రాజ్, దగ్గుల లింగయ్య, కోపేలి రవి, ఇసుకపల్లి శీను, శ్యామ్ తీవరి, దాసరి గోపాలకృష్ణ, పొదిలా శ్యామ్, కామ ప్రణయ్, నవీన్, మామిడాల భాస్కర్, సన్నీ, శ్రీవెద్, గోగేలా రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply