5లోపే వక్ఫ్ వివరాలను అప్లోడ్ చేయాలి
- ముస్లిం జేఏసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్
విజయవాడ, ఆంధ్రప్రభ : ఉమిద్ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించాలని చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు స్పష్టంగా తిరస్కరించిందని, ఈ నేపథ్యంలో గడువు ముగిసేలోపే ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయాలని ముస్లిం ఏజేసీ కన్వీనర్ షేక్ మునీర్ అహ్మద్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గడువు పూర్తయ్యాక ఉమిద్ పోర్టల్‌లో వివరాలు అప్లోడ్ చేయాలంటే వక్ఫ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాల్సి వస్తుందని, అది చాలా కష్టతరమని పేర్కొన్నారు. అందువల్ల అన్ని వక్ఫ్ ముతవల్లీలు, అడ్మినిస్ట్రేటివ్ కమిటీలు, సంబంధిత వ్యక్తులు వెంటనే అవసరమైన వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలని కోరారు.
పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు, లోపాలు, అప్లోడింగ్ ఇష్యూలు ఎదురయ్యే వారెవరైనా తప్పనిసరిగా support@umeed.gov.in ను సంప్రదించాలని ఆయన సూచించారు. ఇ-మెయిల్లో అప్లోడ్ చేస్తున్న వ్యక్తి మొబైల్ నంబర్, దరఖాస్తు నంబర్, అలాగే వీలైతే సంబంధిత స్క్రీన్‌షాట్ లేదా లోప వివరణ తప్పనిసరిగా జత చేయాలని చెప్పారు.
సమయం అత్యంత తక్కువగా ఉండటంతో, ప్రతి ఒక్కరూ వెంటనే తమ వక్ఫ్ ఆస్తుల వివరాలను అప్లోడ్ చేయడం కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
