ముస్లిం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..

ముస్లిం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి..

గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ & ఆడిటర్ ఖాజా మస్తాన్

గుంటూరు, ఆంధ్ర‌ప్ర‌భ : వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “తాలీం-ఎ-హునర్ టాలెంట్ టెస్ట్” కార్యక్రమాన్ని వక్ఫ్ బోర్డు విజనరీ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ & ఆడిటర్ ఖాజా మస్తాన్ తెలిపారు. పేద ముస్లింలు విద్య పరంగా అభివృద్ధి సాధించినప్పుడే సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పడతాయని, అందుకే ఈ టాలెంట్ టెస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ (IIT-JEE, NEET, EAMCET) అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ రూపొందించారని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా పేద, మధ్యతరగతి ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు సరైన మార్గదర్శకత్వం, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు లభిస్తాయని ఖాజా మస్తాన్ పేర్కొన్నారు. అలాగే ఈ టాలెంట్ టెస్ట్‌లో పాల్గొనదలుచుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://apwaqfboard.el91.com/REH/ లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే హెల్ప్ లైన్ నంబర్లకు +91-6303325356, 8978452495 ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఖాజా మస్తాన్ సూచించారు. అందువల్ల గుంటూరు జిల్లా ముస్లిం విద్యార్థులు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఖాజా మస్తాన్ పిలుపునిచ్చారు. అప్లికేషన్ తేదీలు, పరీక్ష వివరాలు అధికారిక ప్రకటనలో అందుబాటులో ఉన్నాయని, ఆసక్తి గల వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.

Leave a Reply