ప్రజల గడపకే ప్రజాపాలన..

  • ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహించిన బొడ్డు వెంకటరమణ చౌదరి
  • ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా ప్రచారం
  • స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ

రాజానగరం, ఆంధ్రప్రభ: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం పాలచర్ల గ్రామంలో రూడా చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో ‘ఇంటింటికి తెలుగుదేశం’ (డోర్ టు డోర్) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ఆత్మీయంగా పలకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వాటికి సంబంధించిన కరపత్రాలను కూడా పంపిణీ చేశారు.

అదేవిధంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలు, మౌలిక వసతుల అవసరాలు, ఇతర ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం, గ్రామాభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు.