వృత్తి విద్య విద్యార్థులకు సువర్ణావకాశం
కోదాడ (ఆంధ్రప్రభ): వృత్తి విద్య (ఒకేషనల్) కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నల్లగొండ పట్టణంలోని కేపీఎం ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో జూలై 14న ఉదయం 10 గంటలకు అప్రెంటిస్‌షిప్-కమ్-జాబ్ మేళా-2026 నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నారు రమణారెడ్డి తెలిపారు.
2023–24, 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో కోదాడ, పరిసర ప్రాంతాల కళాశాలల్లో వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్‌తో పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.9,600 నుంచి ఆకర్షణీయమైన వేతనం అందే అవకాశం ఉందని తెలిపారు.
జాబ్ మేళాకు సంబంధించి మరిన్ని వివరాల కోసం కళాశాల వృత్తి విద్యా కోర్సుల లెక్చరర్ జి. యాదగిరిని 9949294976 నంబర్లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
