APL | విజయవాడ సన్ షైనర్స్ అద్భుత విజయం..

  • బ్యాటింగ్లో సత్తా చాటిన అశ్విన్ హెబ్బార్ జహీర్ అబ్బాస్
  • 4 వికెట్లు తీసి తుంగభద్ర టీం ను వెనక్కి నెట్టిన విజయవాడ బౌలర్ భరత్
  • 19 పరుగుల తేడాతో విజయవాడ సన్ షైనర్స్ విజయం

కడప, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 కడపలో మొదటి మ్యాచ్ అద్భుతంగా జరిగింది మొదటి మ్యాచ్ చూడడానికి ప్రేక్షకులు స్టేడియం కు క్యూ కట్టారు కడపలో క్రికెట్ అభిమానులను చూసి ప్లేయర్లు మేనేజ్మెంట్స్ అంతా ఆశ్చర్యానికి గురయ్యారు మొదటిగా మ్యాచ్ ప్రారంభానికి ముందు సింగర్ సునీత తన గానంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు టాస్ వేయడానికి ముందే స్టేడియం మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసిపోయింది టాస్ వేయడానికి బీసీసీఐ అపెక్స్ నంబర్ చాముండేశ్వరి నాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు అనంతరం వాసు వేసిన తర్వాత విజయవాడ సన్ షైనర్స్ టాస్ గెలిచి తొలుతగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

విజయవాడ ఓపెనర్స్ శుభరంభం..

మొదట బ్యాటింగ్కు దిగిన విజయవాడ జట్టు ఓపెనర్స్ టీంకు శుభ ఆరంభాన్ని అందించారు ముందుగా పవర్ ప్లే ముగిసే సమయానికి విజయవాడ జట్టు స్కోరు ఆరు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది అనంతరం ముందు ప్రారంభించిన పౌర హిటింగ్ని విజయవాడ జట్టు చివరి వరకు కొనసాగించింది ఆ జట్టు ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ 48 బంతుల్లో 55 పరుగులు 9 ఫోర్లు 4 సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అనంతరం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ స్థానిక కడప వాసి జహీర్ అబ్బాస్ విజయవాడ టీం తరఫున ఆడుతూ కేవలం 25 బంతుల్లోనే 52 పరుగుల తోబౌండరీ లో వర్షం కురిపించాడు 3 ఫోర్లు నాలుగు సిక్సర్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు తుంగభద్ర బౌలర్లలో దీపక్ హిమ శ్రీనివాస్ రెండు వికెట్లు పడగొట్టారు

తడబడిన తుంగభద్ర..

అనంతరం బ్యాటింగ్కు దిగిన తుంగభద్ర వారియర్స్ జట్టు ఆదిలోనే వికెట్ను కోల్పోయింది. అయినప్పటికీ మరో ఓపెనర్ సమన్యు24 బంతుల్లో 51 పరుగులు 7ఫోర్లు 3సిక్సర్లు. సత్య సూర్యనారాయణ 21 బంతుల్లో 29 పరుగులు 4 ఫోర్లు మరియు చివర్లో సౌరవ్ కుమార్ 15 బంతుల్లో 23 పరుగులు 2ఫోర్లు 2 సిక్సర్లతో ధాటిగా ఆడిన టీంకు విజయాన్ని చేకూర్చలేకపోయారు మిగతా ఏ బ్యాటరీ కూడా సరైన పార్ట్నర్షిప్ లేకపోవడంతో తుంగభద్ర జట్టు ఓటమిని చూడాల్సి వచ్చింది . విజయవాడ బౌలర్లలో భారత్ నాలుగు వికెట్లు తీసి తుంగభద్ర జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు మరో విజయవాడ బౌలర్ సుమిత్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా విజయవాడ సన్ షైనర్స్ జట్టు కెప్టెన్ ఓపెనర్ బ్యాటర్ అశ్విన్ హెబ్బార్ ఎంపికయ్యాడు.