ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శిగా విజయ్ భాస్కర్..

జూలూరుపాడు, ఆంధ్రప్రభ : ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి గా జూలూరుపాడు గ్రామానికి చెందిన పెండ్యాల విజయ భాస్కర్ నియమితులయ్యారు. సోమవారం నియామక వివరాలను విజయ భాస్కర్ విలేకరులకు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయ భాస్కర్ మాట్లాడుతూ హైద్రాబాద్ నగరంలో రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించినట్లు తెలిపారు.ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి,సంఘ నిర్మాణానికి మూడున్నర దశాబ్దాలుగా గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అంచలంచెలుగా పనిచేశానన్నారు.

సీనియర్ ఆర్యవైశ్య నాయకుడు ధారా రామనరసింహం ప్రోత్సాహంతో ముప్పై ఐదు ఏళ్ల క్రితం ఆర్యవైశ్య మహాసభ సంఘంలో సభ్యత్వం తీసుకున్నట్లు వివరించారు.ఆర్యవైశ్య యువజన సంఘంలో మండల, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సేవలు అందించానన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభకు గౌరవ అధ్యక్షులుగా పని చేస్తున్నానని, మూడు సంవత్సరాలుగా రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ కార్యవర్గంలో సభ్యులుగా పనిచేసానన్నారు.

నాలుగు పర్యాయలు జరిగిన ఆర్యవైశ్య జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో కీలకపాత్రను పోషించి సంఘంలో మన్ననలను పొందినట్లు విజయ భాస్కర్ చెప్పారు.సేవా కార్యక్రమాలు,ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధి,సభ్యత్వ నమోదు,సంఘ నిర్మాణంలో తన వంతు పాత్రను గుర్తించిన ఆర్యవైశ్య మహాసభ నూతన అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ రాష్ట్ర కార్యదర్శిగా నియమించటం జరిగిందన్నారు.రాష్ట్ర కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు మరవాది లక్ష్మీనారాయణకు విజయ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply