ప్రభుత్వాసుపత్రి పై విజిలెన్స్ దాడులు..

కరీంనగర్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి పై విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఆస్పత్రిలోని రికార్డులను, కంప్యూటర్లను పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో మందుల విషయంలో అడ్డగోలు అవినీతి జరుగుతుందని క్యాంటీన్ నిర్వహణ లోపం పార్కింగ్ నిర్వహణ లోపం ఇతరత్రా అంశాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి లోని పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రతి డాక్యుమెంట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
