ఊట్కూర్ పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి…

ఊట్కూర్ పట్టణం అన్నిరంగాల్లో అభివృద్ధి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోనిశివాజీనగర్ వీధిలో డ్రైనేజీపనులుప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీడీకే అరుణమ్మ నిధులు తీసుకొచ్చి గ్రామ సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

పట్టణంలోని 16 వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీలు ప్రజలకు కావలసినమౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. కేంద్రరాష్ట్రప్రభుత్వ నిధులతో అందరి సహకారంతో అభివృద్ధి పరుగులు పెట్టిస్తామన్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. వేసవికాలంలో విద్యుత్ తాగునీటి ఎద్దడి నివారించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకుసాగుతున్నామని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు లావణ్య, సీనియర్ నాయకులు ఆశప్ప, రఘువీర్, నాయకులు కార్యకర్తలురణవీర్,శంకర్,హన్మంతు ,భాను, జగన్,అమీర్, చరణ్, హరి తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply