గ్రామ రక్షణ కోసం పెట్టిన కెమెరాలే ఎత్తుకెళ్లారు!

లక్ష్మణచాంద ఆంధ్రప్రభ: మండలంలోని వడ్యాల్ గ్రామంలో సీసీ కెమెరాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. గ్రామ విడీసీ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల ముందు శివాజీ చౌక్‌లో ఏర్పాటు చేసిన సోలార్‌ సీసీ కెమెరాలను ఆదివారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేసి తీసుకెళ్లారు.

గ్రామ రక్షణ కోసం ఏర్పాటు చేసిన కెమెరాలనే దొంగలు ఎత్తుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామ సర్పంచ్ నరేష్, విడీసీ కోశాధికారి రాజేంద్రప్రసాద్ తెలిపారు.