ఒకే రకమైన పంటలు వేస్తే..

ఒకే రకమైన పంటలు వేస్తే..
కుంటాల, ఆంధ్రప్రభ : పంటల సాగు పద్ధతులపై కుంటాల మండలంలోని పెంచికల్ పాడులోని రైతులకు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలుతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ అకుల దినేష్, నిర్మల్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కార్తీక్ లు మాట్లాడుతూ.. పంటల మార్పిడి మూలంగా రైతులకు మంచి దిగుబడి లభిస్తాయని, రైతులు పంటలు మార్పిడి చేయాలని ఒకే రకమైన పంటలు వేస్తే.. తక్కువ దిగుబడి వస్తుందని పంటల దిగుబడి రావాలంటే.. పంటల మార్పిడి తప్పనిసరిగా రైతులు చేయాలని సూచించారు.
మొక్కజొన్న, పత్తి పంటలతో పాటు ఇతర పంటలు ఆదాయం వచ్చే పంటలు పొద్దుతిరుగుడు, సజ్జలు, వేరుశనగ నువ్వులుతో పాటు చిరుధాన్యాలకు సంబంధించిన పంటలను పండించాలి అన్నారు. పంటల మార్పిడి మూలంగా ఏకగ్రీవంగా ప్రతి సంవత్సరం పంటలు పండించడం వల్ల పురుగులు, తెగుళ్లు ఉధృతి పంటల పై ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా పంటలు దిగుబడి తగ్గి ఆదాయం తగ్గిపోతుందని రైతులకు వివరంగా తెలియజేశారు.
పంటల మార్పిడి మూలంగా ప్రతి ఒక్క రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సాధించవచ్చు అని పేర్కొన్నారు. రైతులు పండించిన పంటల సాగు విధానాల పై శాస్త్రవేత్తలను రైతులు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయ విధానంతో ప్రతి ఒక్క రైతు సాగు చేయాలని ప్రకృతి వ్యవసాయ విధానం ఎలా సాగు చేయాలనే దాని పై కూడా వివరించారు. మంచి దిగుబడులు వస్తాయని సేంద్రియ ఎరువులు వాడి మంచి దిగుబడి సాధించాలని పంటలకు ఎక్కువ పిచ్చకారులు చేయకూడదని అధిక మోతాదులో యూరియా వాడకూడదని.. నానో యూరియా పై ప్రత్యేక దృష్టి పెట్టాలి అన్నారు. నానో యూరియా మంచి దిగుబడి నిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కదం హిమ్మత్ రావు, పటేల్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి గణేష్, ఉప సర్పంచ్ రాములు, ఆదర్శ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
