Chandrababu Politics | కూటమి పాలనపై భూమన తీవ్ర విమర్శలు

Chandrababu Politics | కూటమి పాలనపై భూమన తీవ్ర విమర్శలు

Chandrababu Politics | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

టీడీపీని తెలివిగా దోచుకునే పార్టీగా అభివర్ణించిన భూమన, ‘‘టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ’’ అంటూ విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం మరో ఐదేళ్లు ప్రజలను పీడించబోతోందని వ్యాఖ్యానించారు.

మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పాలన సాగిందని, ప్రస్తుతం కూటమి పాలన సంక్షోభాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలు ప్రజలను మోసం చేసేందుకు చేసిన ప్రచారమేనని అన్నారు.

ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం వంటి హామీల అమలుపై మహిళలు, యువత ప్రశ్నిస్తున్నారని భూమన పేర్కొన్నారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

చంద్రబాబు పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదని భూమన అన్నారు. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యారంగానికి చెందిన వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అప్పుల భారం పెరిగిన ప్రాంతంగా, బెల్ట్ షాపుల రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు.

Leave a Reply