Cycling | గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా

Cycling | గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా

సైక్లింగ్‌తో మెరుగైన ఫిట్‌నెస్‌

Cycling | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ప్రపంచ సైకిల్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సండేస్‌ ఆన్‌ సైకిల్‌’ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. తెలంగాణ గవర్నర్‌ శివ్‌ ప్రతాప్‌ శుక్లా ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ నిర్వహించింది.

ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. మెరుగైన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, పర్యావరణ సుస్థిరత కోసం సైక్లింగ్‌ను జీవన విధానంగా స్వీకరించాలని పౌరులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో సైక్లింగ్‌కు ప్రాధాన్యం ఇస్తే ఆరోగ్యకరమైన సమాజంతో పాటు కాలుష్యరహిత పర్యావరణం సాధ్యమవుతుందని తెలిపారు.

ఆరోగ్యకరమైన జీవనశైలి, స్వచ్ఛమైన పర్యావరణం పట్ల అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో సైక్లిస్టులు, యువత, క్రీడాకారులు, ఫిట్‌నెస్‌ ప్రియులు పాల్గొన్నారు. ప్రతి పెడల్‌ ఆరోగ్యకరమైన దేశానికి, పచ్చని భవిష్యత్తుకు దోహదపడుతుంద‌న్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి, క్రీడల సలహాదారు జితేందర్‌రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, ఎస్ఏటీజీ వీసీ అండ్‌ ఎండీ సోనిబాలా దేవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply