India- no – objection – 2025 I భార‌త్‌కు అభ్యంత‌రం లేదు!

భార‌త్‌తో ఘ‌ర్ష‌ణ ప‌డే ఉద్దేశం అమెరికాకు లేదు
వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాల‌కు మేలు
అమెరికా విదేశాంగ కార్య‌ద‌ర్శి మార్కో రూబియో

India- no – objection- ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌, జాతీయం : ప‌శ్చిమాసియా ఉద్రిక‌త్త‌లు త‌గ్గించ‌డం కోసం అమెరికా-ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మ‌ధ్య‌వ‌ర్తిత్వంపై భార‌త్‌కు అభ్యంత‌రం లేద‌ని, దీన్ని భార‌త్ దేశం వేరుగా చూడ‌టం లేద‌ని అమెరికా విదేశాంగ కార్య‌ద‌ర్శి మార్కో రూబియో అన్నారు. సోమ‌వారం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. పాకిస్థాన్ విషయంలో భారత్ ఎప్పుడూ ఆందోళన చెందుతుందని, అయితే అమెరికా-ఇరాన్ యుద్ధంలో ఇస్లామాబాద్ మధ్యవర్తిగా వ్యవహరించడంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని స్ప‌ష్టం చేశారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు నాలుగు రోజుల భారత్ పర్యటనకు రూబియో వ‌చ్చారు.

India- no – objection- పాకిస్థాన్‌పై ఆందోళ‌న‌కు ఇదే కార‌ణం…
పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని భారత్ ఎప్పటినుంచో చెబుతోంద‌ని, ఆ విషయంపై భారత్‌కు ఎప్పుడూ ఆందోళన ఉంటుంద‌ని రూబియో అన్నారు. ఇరాన్ పరిస్థితిలో పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం లేద‌న్నారు. భారత్‌కు పాకిస్థాన్‌తో ఉన్న సమస్య వేరు అని పేర్కొన్నారు.

India- no – objection- అమెరికాకు వ్యూహాత్మ‌క భాగ‌స్వామి
భార‌త్ ప్ర‌ధాని నరేంద‌ర్ మోడీ, విదేశాంగ మంత్రి జ‌య‌శంక‌ర్‌తో ద్వైపాక్షిక స‌మావేశాల కోసం భార‌త్‌కు చేరుకున్నారు. ఈ నెల‌ 26న జరగనున్న క్వాడ్ సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత ప్రధాన చర్చాంశంగా ఉండనుంది. భారత్‌ను అమెరికాకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామిగా పేర్కొన్న రూబియో, “ఈ ప్రభుత్వ కాలం ముగిసే నాటికి భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని నేను నమ్ముతున్నాను,” అని అన్నారు. భార‌త్‌తో ఘ‌ర్ష‌ణ ప‌డే ఉద్దేశం అమెరికాకు లేదని స్ప‌ష్టం చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలు ఇరు దేశాలకు మేలు చేకూరుస్తాయ‌ని అన్నారు. “ప్రపంచంలోని అనేక దేశాలతో మేము వ్యూహాత్మక స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తాం. భారత్ కూడా అదే చేస్తుంది. బాధ్యతాయుత దేశాలు అలా వ్యవహరిస్తాయి,” అని చెప్పారు.

రూబియో మాట్లాడుతూ …అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ కీలక మధ్యవర్తిగా ఎదిగింది. అమెరికా సహకారంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో పాకిస్థాన్ పాత్ర ముఖ్యం. ఆ ఒప్పందం గత ఆరు వారాలుగా కొనసాగుతోంది. ఇస్లామాబాద్ రెండు దేశాల మధ్య విస్తృత శాంతి ఒప్పందం కుదిరేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పాకిస్థాన్ సైన్యాధిపతి ఇటీవల టెహ్రాన్‌ను సందర్శించారు.


India- no – objection- ట్రంప్‌కు మంచి మిత్రుడు మోడీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయం కూడా ఇదే అని స్ప‌ష్టం చేశారు. “పాకిస్థాన్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణకు మేము అంగీకరించాం. ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్, ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ అద్భుతమైన నాయకులు,” అని ట్రంప్ పేర్కొన్న‌ట్లు రూబియో అన్నారు. అలాగే అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ట్రంప్, ప్రధాని మోదీని “నా గొప్ప మిత్రుడు”గా అభివర్ణించార‌ని గుర్తు చేశారు. “నాకు ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టం. ఆయన నా స్నేహితుడు. భారత్ నాపై 100 శాతం నమ్మకం ఉంచవచ్చు,” అని ట్రంప్ పేర్కొన్నార‌ని తెలిపారు.

Leave a Reply