Utnoor | ప్రమాణ స్వీకారం.. సంబరాలు..

Utnoor | ప్రమాణ స్వీకారం.. సంబరాలు..

Utnoor | ఉట్నూర్,ఆంధ్రప్రభ : ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గా గెలుపొందిన జాదవ్ అనిత శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఘనంగా సంబరాలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ చౌక్ లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉట్నూర్ నూతన సర్పంచ్ అనిత శ్రీనివాస్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డప్పులు మోగిస్తూ.. నృత్యాల చేస్తూ కొనసాగిన ర్యాలీలో బంధుమిత్రులు అభిమానుల మధ్య ర్యాలీగా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీ వరకు తరలివెళ్లారు. ఈ వేడుకల్లో నూతన సర్పంచ్ అనిత శ్రీనివాస్ బంధువులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply