రెండో రోజు ఘనంగా హోలీ సంబరాలు..
రెండో రోజు ఘనంగా హోలీ సంబరాలు..
హోలీ సంబరాలు జరుపుకుంటున్న పెద్దలు నాయకులు
ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో ఈసారి హోలీ పండుగను రెండు రోజులు ప్రజలు జరుపుకున్నారు. మంగళవారం చంద్రగ్రహణంతో కొందరు సెంటిమెంటుతో కొన్ని గ్రామాల్లో హోలీ పండుగను జరుపుకోలేదు కొన్ని గ్రామాల్లో హోలీ పండుగను జరుపుకున్నారు. బుధవారం ఉట్నూరు పట్టణంతోపాటు పలు కాలనీలో గ్రామాల్లో రెండో రోజు హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో లక్కారం గంగాధర్ దొర, లక్కారం వార్డు సభ్యులు భీమన్న, కాంగ్రెస్ నాయకులు మసూద్ ల్లి, యూత్ నాయకులు అంజత్ ఖాన్, సర్పంచులు, గ్రామ పెద్దలు నాయకులు, ఉద్యోగులు, యువకులు, పిల్లలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
