vote | ఓటు హక్కును వినియోగించుకోండి..

vote | ఓటు హక్కును వినియోగించుకోండి..

  • ఏసీపీ వెంకటేశ్వర్లు

vote | చెన్నూర్, ఆంధ్రప్రభ: మరికొద్ది రోజుల్లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ‌ చెన్నూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసు సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఈసందర్భంగా ఏసీపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ముందుగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే పోలీసు సిబ్బంది ఎలాంటి విధులు నిర్వర్తించాలో, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి చట్టాలు, బందోబస్తు పై క్లుప్తంగా ఏసీపీ వివరించారు. చెక్ పోస్ట్ ల వద్ద డ్యూటీ చేసే సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఏ ప్రాంతంలో ఉన్నా తమ స్వగ్రామానికి వ‌చ్చి ఓటు వేయాలని, అలాగే ప్రజలు ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి సహకరించి, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాల‌ని కోరారు.

Leave a Reply