Jaag Laadki Returns : జాగ్ లాడ్కీ వచ్చేస్తోందోచ్ Andhra Prabha Detail Report

Jaag Laadki Returns : జాగ్ లాడ్కీ వచ్చేస్తోందోచ్ Andhra Prabha Detail Report
- ఫుజైరాలో ఇరాన్ డ్రోన్ దాడి
- ‘జాగ్ లాడ్కీ’ జస్ట్ మిస్
- పశ్చిమ ఆసియా ఘర్షణలో సంచలనం
- ఖార్గ్ దాడికి ఇరాన్ ప్రతీకారం
- 80,000 టన్నుల చమురు సురక్షితం
- భారత్ ముంద్రా పోర్టుకు ‘జాగ్ లాడ్కీ’
- గల్ఫ్‌లో యుద్ధ టెన్షన్
- భారత నౌకపై ప్రపంచం దృష్టి
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)

Jaag Laadki Returns : ఫుజైరా చమురు టెర్మినల్‌పై ఇరాన్ డ్రోన్ దాడి సమయంలో అక్కడే ఉన్న భారతీయ ట్యాంకర్ ‘జాగ్ లాడ్కీ’ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. 80 వేల టన్నుల చమురుతో భారత్‌కు బయలుదేరిన ఈ నౌకలోని సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని కేంద్రం తెలిపింది.
ఇరాన్ బంగారు చమురు కొండ ఖార్గ్ ద్వీపంపై అమెరికా బలగాలు.. దాడికి ప్రతీకారంగా ఒమన్ లోని ఫుజైరా టెర్మినల్ పై ఇరాన్ డ్రోన్ డేగలు విరుచుకు పడగా.. ఈ దాడిలనుంచి తృటిలో తప్పించుకున్న భారత నౌక ‘జాగ్ లాడ్కీ’ (జగత్ లడ్డీ) సఉరక్షితంగా భారత్ కు బయలు దేరింది. ఈ దాడి శనివారం భారత కాలమానం (IST) ప్రకారం మధ్యాహ్నం 3:00 గంటల నుండి 3:30 గంటల మధ్య జరిగింది. ఆ సమయంలో ఫుజైరా టెర్మినల్ లో ‘జాగ్ లాడ్కీ’ చమురును లోడ్ చేసుకుంటోంది. దాడిలో తప్పించుకున్న జాగ్ లాడ్కీ మరుసటి రోజు అంటే మార్చి 15, ఆదివారం ఉదయం 10:30 గంటలకు (IST) ఫుజైరా నుంచి క్షేమంగా బయలుదేరింది.
Jaag Laadki Returns : ఆ రోజు ఏమి జరిగింది?

అదే శనివారం తెల్లవారుజామున ఇరాన్ లో కీలక చమురు స్థావరం ఖార్గ్ ద్వీపంపై దాడి జరపి.. ఆ ద్వీపాన్ని ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఫుజైరా టెర్మినల్ పై ఇరాన డ్రోన్లు దూసుకు వచ్చాయి. UAE రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను అడ్డుకున్నప్పటికీ, ఆ శకలాలు చమురు నిల్వ కేంద్రాల్లో పడి భారీ మంటలు చెలరేగాయి. సివిల్ డిఫెన్స్ బృందాలు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు
Jaag Laadki Returns : ఇరాన్ ప్రతీకారం దేనికి?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చెందిన ఒమన్ గల్ఫ్ తీరంలో ఫుజైరా చమురు టెర్మినల్ ఉంది. వ్యూహాత్మక హార్ముజ్ జలసంధికి (Strait of Hormuz) వెలుపల ఉంది. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వ రవాణాలో ఫుజైరా టెర్మినల్ అత్యంత కీలక కేంద్రం. అందుకే అమెరికాకు సహకరిస్తున్న UAE ఓడరేవులు, డాక్‌లు తమకు లక్ష్యాలు అని (legitimate targets) ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది.
Jaag Laadki Returns : జాగ్ లాడ్కీ సేఫ్.

దాడి సమయంలో భారతీయ ట్యాంకర్ ‘జాగ్ లాడ్కీ’ అక్కడే ‘ముర్బన్’ రకం చమురును లోడ్ చేసుకుంటోంది. ఈ నౌకకు ఎలాంటి నష్టం కలగలేదు. సుమారు 80,800 టన్నుల చమురుతో ఆదివారం ఉదయం 10:30 గంటలకు (IST) ఫుజైరా నుండి బయలుదేరి భారత్ ముంద్రా పోర్ట్ వైపు ప్రయాణిస్తోంది. నౌకలోని భారతీయ నావికులు అందరూ క్షేమంగా ఉన్నారని భారత ప్రభుత్వం (Ministry of Petroleum and Natural Gas) అధికారికంగా ధృవీకరించింది. ముంబైకి చెందిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ (Great Eastern Shipping Company) కి చెందిన జాగ్ లాడ్కీ 2010లో నిర్మించారు. సూయజ్ మాక్స్ (Suezmax) తరగతికి చెందిన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. భారతీయ జెండాతో జాగ్ లాడ్కీ నడుస్తోంది.
ALSO READ : Kharg Island Strike : ఇరాన్ ఆయువు పట్టు ధ్వంసం Andhra Prabha News
