సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం…

సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం…
డోన్ నియోజకవర్గం లో కొత్తబురుజు గ్రామంలో ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ మేరకు ఇంటింటికి శుద్ధజలాన్ని అందించే లక్ష్యంతో కొళాయి కనెక్షన్ల పనులను ఇంటింటికీ అందించే కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ డోన్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. గురువారం డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజు గ్రామంలో జిల్లా మినరల్ ఫండ్ నుంచి రూ.30 లక్షల వ్యయంతో ఘనంగా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి లు ప్రారంభించారు.
అలాగే, గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగుదొడ్లు లేని 30 మంది లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం రూ.4.5 లక్షలను మంజూరు చేశారు. గ్రామంలోని పనులను ప్రారంభించరు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు మరింత బలం చేకూరనుందని పేర్కొన్నారు.

జిల్లాలోని అన్ని గ్రామాల్లో తాగునీటి వస్తువులు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలోని ప్రజలు సమస్యలను జిల్లా కలెక్టర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొన్నారు.
