UP | మరో పాక్ స్పై అరెస్ట్

లక్నో : భారత రక్షణ సమచారాన్ని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కు చేరవేసిన :ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. భారత రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

షాజాద్ గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌కు అనేకసార్లు వెళ్లాడు. సరిహద్దు మీదగా బట్టలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. వ్యాపారం ముసుగులో భారత రహస్యాలను పాకిస్థాన్ ఐఎస్ఐకు చేరవేసినట్లుగా కనుగొన్నారు. ఐఎస్ఐ ఏజెంట్లకు షాజాద్‌ డబ్బు, భారతీయ సిమ్‌ కార్డులు అందించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఐఎస్ఐ కోసం పని చేయడానికి రాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలను పాకిస్థాన్‌కు పంపించినట్లుగా గుర్తించారు.

వీళ్లందరికి వీసాలను ఐఎస్ఐ ఏజెంట్లు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Leave a Reply