ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక

మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసులు, కార్యదర్శి సీహెచ్. ఐలయ్య ఆదేశాల మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. గోపాలం పరిశీలకుడిగా నారాయణపేట జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఎన్నికలను నిర్వహించారు.
ఆదివారం మక్తల్ పట్టణంలోని ఎంపీపీఎస్ పాఠశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఎన్నికల అధికారిగా మక్తల్ సీనియర్ అడ్వకేట్ కె. సూర్యప్రకాశ్ వ్యవహరించారు. సమావేశానికి హాజరైన 42 మంది సభ్యులు జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షుడిగా డాక్టర్ కలాల్ మణికంఠ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బి. గోపాలం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా జి. శివకుమార్, విష్ణువర్ధన్ పీడీ, బి. నరేష్ గౌడ్, డీఆర్. మీనాకుమారి పీఈటీ, కోస్గి విష్ణువర్ధన్ రెడ్డి, గుడిసె నరసింహ ఎన్నికయ్యారు.
సంయుక్త కార్యదర్శులుగా రామ్మోహన్ గౌడ్, జి. బాల్రెడ్డి, రేణుక పీడీ, పరశురాం, బాలు అంబిక, కావలి ప్రవీణ్, జాజాపూర్ కృష్ణ, వెంకటేష్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా శివప్రసాద్, నిర్వహణ కార్యదర్శిగా ఎస్. రమేష్ కుమార్ పీఈటీ ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా డి. సమరసింహారెడ్డి, బి. దామోదర్ పీఈటీ, చంద్రకళ పీఈటీ, ఏ. లక్ష్మీనారాయణ, నీలిగిరిలను ఎన్నుకున్నట్లు రాష్ట్ర అబ్జర్వర్ బి. గోపాలం, ఎన్నికల అధికారి కె. సూర్యప్రకాశ్ ప్రకటించారు.
ఎన్నికైన నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బి. గోపాలం మాట్లాడుతూ, 2002 నుంచి ఇప్పటి వరకు నారాయణపేట జిల్లా నుంచి 364 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో, 86 మంది జాతీయస్థాయిలో, నలుగురు అంతర్జాతీయ స్థాయిలో షూటింగ్ బాల్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. జాతీయస్థాయిలో 14 బంగారు, 16 రజత, 12 కాంస్య పతకాలు సాధించినట్లు వెల్లడించారు.
నూతన అధ్యక్షుడు డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యత రావడం ఆనందంగా ఉందన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం పెరుగుతాయని, స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు పంపేలా కృషి చేస్తామని తెలిపారు.
