UGC NET | యూజీసీ-నెట్ హాల్‌టికెట్లు విడుదల..
UGC NET | యూజీసీ-నెట్ హాల్‌టికెట్లు విడుదల..
UGC NET | వెంటనే డౌన్‌లోడ్ చేసుకోండి!
జూన్ 22 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలు
అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులోకి..
వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచన
UGC NET | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఉన్నత విద్యా రంగంలో ఉద్యోగాలు, పరిశోధన అవకాశాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు కీలక సమాచారం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) యూజీసీ-నెట్ జూన్–2026 పరీక్షల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎన్‌టీఏ షెడ్యూల్ ప్రకారం యూజీసీ-నెట్ పరీక్షలు జూన్ 22 నుంచి జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రం, తేదీ, షిఫ్ట్ సమయం తదితర వివరాలు అడ్మిట్ కార్డులో పొందుపరిచారు.
అడ్మిట్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
యూజీసీ-నెట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
హోమ్‌పేజీలో కనిపించే “UGC NET June 2026 Admit Card” లింక్‌పై క్లిక్ చేయాలి.
అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
‘సబ్మిట్’పై క్లిక్ చేసిన వెంటనే అడ్మిట్ కార్డు తెరపై కనిపిస్తుంది.
దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.
పరీక్షకు వెళ్లేటప్పుడు ఇవి తప్పనిసరి
పరీక్షా కేంద్రానికి హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డు వంటి వాటిని గుర్తింపు పత్రాలుగా ఉపయోగించవచ్చు. అదనంగా రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు కూడా వెంట ఉంచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
