tvk | సీఎల్పీలో చర్చించి నిర్ణయం…

tvk | సీఎల్పీలో చర్చించి నిర్ణయం…

tvk |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు కాంగ్రెస్ పార్టీ కీలక మద్దతు ప్రకటించింది. అయితే ఈ మద్దతుకు ఒక ముఖ్యమైన షరతును కూడా ముందుంచింది.

కాంగ్రెస్ విడుదల చేసిన లేఖలో, మతతత్వ శక్తులను చేర్చుకోకూడదని టీవీకే అధినేత విజయ్ కు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకేకు పూర్తి మద్దతు ఇస్తామని, సీఎల్పీలో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

తమ కూటమి పెరియార్, బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

Leave a Reply