TTD Parakamani case | హైకోర్టు కీలక వ్యాఖ్యలు

TTD Parakamani case | హైకోర్టు కీలక వ్యాఖ్యలు

TTD Parakamani case | అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరకామణి కేసు మరోసారి సంచలనం రేపింది. టిటిడి పరకామణి కేసు (TTD Parakamani case) పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవాళ‌ ఈ కేసుపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం టిటిడి పరకామణి కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్‌ కేసులు (Criminal cases) నమోదు చేయాలని పేర్కొంది.

కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సిఐడి, ఏసీబీ అధికారులకు (CID and ACB officers) హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటింగ్‌ అంశంలో టేబుల్‌ ఏర్పాట్లపై సూచనలు, సలహాలు ఇవ్వాలని తెలిపింది. తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పరకామణిలో నగదు చోరీ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు వైరలయ్యాయి. ఈ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసులో కీలకమైన టీటీడీ మాజీ ఎస్‌వీఓ అధికారి.. విచారణకు వస్తూ అనుమానాస్పద రీతిలో మరణించారు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply