Tragic incident | చెట్టు కూలి ఒకరు మృతి
Tragic incident | చెట్టు కూలి ఒకరు మృతి
తల్లి, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు
Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గుంటూరు మెడికల్ కాలేజీ సమీపంలో అకస్మాత్తుగా చెట్టు కూలిపోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఓ కుటుంబం బైక్‌పై ప్రయాణిస్తుండగా రోడ్డుపక్కన ఉన్న భారీ వేప చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. చెట్టు నేరుగా బైక్‌పై పడటంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న భార్య, ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలయ్యారు.
స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతుడి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. భారీ గాలులు లేదా వర్షాల కారణంగా చెట్టు కూలిందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
