ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేయాలి

  • గ్రామ స్థాయి నుంచే పార్టీ బలోపేతమే లక్ష్యం..
  • న్యూ ధర్మాజీపేట్, ధర్మాజీపేట్ గ్రామ కాంగ్రెస్ కమిటీలు ఏకగ్రీవ ఎన్నిక

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు ఆదేశాల మేరకు కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు గంగన్న అధ్యక్షతన సోమవారం న్యూ ధర్మాజీపేట్, ధర్మాజీపేట్ గ్రామ కాంగ్రెస్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

న్యూ ధర్మాజీపేట్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బంక బీమేష్, ఉపాధ్యక్షులుగా మాగేని గంగన్న, గోపు రాజేష్, ప్రధాన కార్యదర్శిగా గొర్రె శివ, కార్యదర్శులుగా బుయ్యా శ్రీనివాస్, శివరాత్రి నర్సయ్య, అధికార ప్రతినిధిగా రమేష్, కోశాధికారిగా బీమేష్, కార్యవర్గ సభ్యులుగా వెంకటగోపాల్, గంగాధర్, దశరథ్, అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ధర్మాజీపేట్ గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా గురిజాల రాజన్న, ఉపాధ్యక్షులుగా అమరగొండ రాజన్న, బండ్రా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర జగన్‌రెడ్డి, కార్యదర్శులుగా బొల్లవేని కుమరయ్య, దుంపాల రాజేష్, అధికార ప్రతినిధిగా మాదాసు రాజన్న, కోశాధికారిగా రెడ్డి గంగాధర్, కార్యవర్గ సభ్యులుగా గైడం సీతారామ్, తొడసం ప్రభాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా కడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొడ్డు గంగన్న మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుంచే పార్టీని మరింత పటిష్టపరచడమే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీలు ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చాలని పిలుపునిచ్చారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ నాయకత్వంలో కడెం మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసి, గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముడికె మల్లేశ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సలీం, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముంజా ప్రసాద్ గౌడ్, స్థానిక సర్పంచులు సుమలత, ధర్మాజీపేట్ సర్పంచ్ శిరీష సత్యం, ఉపసర్పంచ్ యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు లింబన్న, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.