కొన్ని గంట‌ల్లో…

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావంతో తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని వ‌రుణుడు వ‌ణికిస్తున్నాడు. జిల్లాల్లో ఎడ‌తెరిపి లేకుండా వాన‌లు ప‌డుతున్నాయి. రాబోయే రెండు మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ (Department of Meteorology) వెల్లడించింది.

ఇవాళ కూడా..
రాష్ట్రంలో రాబోయే మూడు గంటల్లో వర్షం (Rain) కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వరంగల్‌, భూపాలపల్లి, కరీంనగర్, సిద్దిపేట, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరికొన్ని గంటల్లో హైడ్రా (Hydra) పరిధిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆ రెండు రోజులు జ‌ర జాగ్ర‌త్త‌
దీంతో ఈనెల 26వ తేదీని ఆదిలాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, ములుగు, వరంగల్​, జయశంకర్​ భూపాలపల్లి, హనుమకొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్​, సంగారెడ్డి, మెదక్​, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఈనెల 27న ఆదిలాబాద్​, కుమురంభీం ఆసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, వికారాబాద్​, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురవనున్నాయి.