ట్రాఫిక్ నియంత్రణకు అవస్థలు…

ట్రాఫిక్ నియంత్రణకు అవస్థలు…

కరకట్ట నిర్మాణం జరిగేది ఎప్పుడు..
రద్దీ సమయములో ఇబ్బందులు పడుతున్న భక్తులు ..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం కు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు అమ్మవారు దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు ముఖ్యంగా శుక్రవారం ఆదివారం రోజుల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ప్రైవేటు వాహనాలలో భారీగా తరలిరావడంతో ప్రధాన రహదారులు లో వ్యాపారస్తులు రోడ్లపైకి చొచ్చుకు రావడంతో వాహనాల రాకపోకకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ రహదారులు మొత్తం చిన్నగా ఉండటంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చిన సమయంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడి గంటల కొలది వాహనాగారులు ట్రాఫిక్ లో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు ముఖ్యంగా ఆదివారం రోజు సమస్య మరింత జట్టలమవుతుంది.

భక్తులు అమ్మవారి దర్శించుకున్న అనంతరం మునేటి అవతల నున్న మామిడి తోటలో బంధువులకు ఇందు ఏర్పాటు చేసుకునేందుకు వెళ్లి వచ్చే సమయంలో ట్రాఫిక్ నిలిచిపోతుంది ప్రధానంగా పోలీస్ స్టేషన్ కూడలి ఆలయానికి వెళ్లే రోడ్డు మున్నేరు వంతెన మున్నేరు కాలవ కూడలి లో రద్దీ ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం వాహనాలన్నీ ఒకేసారి రోడ్డుపై రావడంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోతున్నాయి ఆ సమయంలో చిన్నారులు మహిళలు అధిక ఉష్ణోగ్రతకు ఇబ్బందులు పడుతున్నారు ట్రాఫిక్ ను క్రమబద్ధరించుటలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారు వాహనాలు దారి మళ్లింపు లో సరైన విధానాన్ని అనుసరించడం లేదు ముఖ్యంగా ప్రధాన దారం వద్ద ఏర్పాటుచేసిన దుకాణదారులు రోడ్లపై చొచ్చుకు రావడంతో వాహనాల రాకపోకకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది దీనివలన ఆలయం వద్ద నుండి పోలీస్ స్టేషన్ సెంటర్ వరకు వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి

కర్కట నిర్మాణం జరిగేది ఎప్పుడు..

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉండటంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనాలు క్రమబద్ధీకరించేందుకు పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద నుండి వన్ వే ఏర్పాటు చేసి ఆలయం వద్దకు వెళ్ళిన తర్వాత ఆలయం వద్ద నుండి కాజువే వరకు కరకట్ట నిర్మాణం జరిగితే చాలావరకు ట్రాఫిక్ సమస్యను పరిష్కరించవచ్చని స్థానికులు తెలుపుతున్నారు దీనిపై పలుమార్లు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు కరకట్ట నిర్మాణం కొరకు ప్రయత్నాలు చేసిన అవి కార్యరూపం దాల్చడం లేదు ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతితులు ప్రత్యేక దృష్టి సారించి కరకట్ట నిర్మాణం త్వరతగతిన పూర్తయ్యేలా చూడాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply